Monday, October 17, 2011

సాగి పోదును


పల్లవి:    సాగి పోదును - ఆగి పోను నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు                       (2X)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ       (2X)
1.        ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను                (2X)
నా సహాయకుడు - నా కాపరి యేసే                        (2X)
హల్లెలూయ
2.        పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా            
పగవాని బానములకైనా - నేను భయపడను                (2X)
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే                     (2X)
హల్లెలూయ
3.        పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం                 (2X)
నాకు కేడెము - నా కోటయు యేసే                        (2X)
హల్లెలూయ

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...