Showing posts with label గీతం గీతం జయ జయ గీతం. Show all posts
Showing posts with label గీతం గీతం జయ జయ గీతం. Show all posts

Monday, October 17, 2011

గీతం గీతం జయ జయ గీతం


పల్లవి:    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి  పాడెదము ఆ ఆ 
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1.        చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను 
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు          ..గీతం..
2.        వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి             ..గీతం..
3.        అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి             ..గీతం..
4.        గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా 
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి                           ..గీతం.. 

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...