Monday, October 17, 2011

హల్లేలూయ పాడెద (Fm)


పల్లవి:   హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్    (2X)
         అన్నీ వేళల యందున నిను పూజించి కీర్తింతును   (2X)
         ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
         ... హల్లేలూయ పాడెద ...
1.      వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే           (2X)
        నమ్మాకమైనా దేవా నను కాపాడు వాడవు నీవే    (2X)
        ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
        ... హల్లేలూయ పాడెద ...
2.     ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్       (2X)
        ప్రభువా నీ వేలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే   (2X)
        ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
        ... హల్లేలూయ పాడెద ...
3.     కష్టాములన్నిటిని ప్రియముగా భరియింతును      (2X)
        నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే      (2X)
        ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
        ... హల్లేలూయ పాడెద ...

హల్లెలూయ యేసు ప్రభున్


1.      హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
పల్లవి:   రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2.       తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి                రాజుల
3.       సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడ గండ్లారమీరు  కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి            రాజుల
4.       యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి                రాజుల
5.     అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి               రాజుల

హల్లేలూయ పాడెద


పల్లవి:    హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                           హల్లేలూయ
1.        వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే           (2X)
ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                           హల్లేలూయ
2.        ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే          (2X)
ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                           హల్లేలూయ
3.        కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే             (2X)
ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                           హల్లేలూయ

హల్లెలూయ స్తుతి మహిమ


పల్లవి:    హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము           
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
1.        అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
2.        ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము     
...హల్లెలూయ...

హల్లెలూయ స్తోత్రం


నాననానా   నాననానా నా
నాననానా   నాననానా నా
హల్లెలూయ స్తోత్రం, నజరేయ నిజమగు స్తోత్రం
ప్రభు తనయ స్తోత్రం నీ దరి చేరనిమ్ము                           (2X)
స్తోత్రం జనకుడ, స్తోత్రం తనయుడ స్తోత్రం శుద్దాత్మా            (4X)
నాననానా   నాననానా నా
నాననానా   నాననానా నా
1.        స్తుతి చేయుట మీకది తెలుయునా మదిని నిండిన స్తోత్రమే
స్తుతి కర్ణుడు ఎవరో తెలుయునా ప్రభువగు యేసు క్రీస్తుడే     (2X)   
 స్తోత్రం
హల్లెలూయ స్తోత్రం
నాననానా   నాననానా నా
నాననానా   నాననానా నా
2.        స్తుతి చేయుట ఎపుడో తెలియునా దివారాత్రము యోగ్యమే
స్తుతి చేయుట ఫలితము తెలియునా ప్రభు కృప మనపై పదిలమే (2X) 
 స్తోత్రం
హల్లెలూయ స్తోత్రం

సృష్టికర్త యేసుని స్తుతించెదము (Db)


పల్లవి:    సృష్టికర్త  యేసుని  స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
           సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము 
           హ...  హ.. హ... హ..  హల్లెలూయా...                     || 3 times ||               
హల్లెలూ... యా  పాడెదము
1.        అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
           చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
           నీదు మహిమను చూపితివే                                || సృష్టి ||
2.        అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను                                   || సృష్టి ||
3.       భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే                                  || సృష్టి ||

సిలువయందె నీదు ప్రేమ


పల్లవి:    సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు                    (2X)                
1.        నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై 
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
.. సిలువయందె..
2.        తండ్రి కుమా శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో 
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
                .. సిలువయందె..

సమీపించరాని


పల్లవి:    సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
   
       మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా  (2X)
యేసయ్యా   నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా   నీ కృప యెంత విలువైనది
   
       యేసయ్యా   నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా   నీ కృప యెంత విలువైనది
1.   
     ధరయందు నేనుండ చరయందు పడియుండ
   
       పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే                         (2X)
   
       కలువకు కరుణను నొసగితివే                                                   .. సమీపించ..
2.   
     మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
   
       నన్నే శ్రుతిగా చేసినది                                                                  (2X)
   
       తులువకు విలువను  యిచ్చినది                                            .. సమీపించ..   

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...