పల్లవి: గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు ..గీతం..
2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి ..గీతం..
3. అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి ..గీతం..
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి ..గీతం..
No comments:
Post a Comment