Monday, October 17, 2011

ఓరన్న ఓరన్న


పల్లవి:     ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                  (2X)
1.            చరిత్రలోనికి వచ్చాడన్నా- పవిత్ర జీవం తెచ్చాడన్నా               (2X)
                
అద్వితీయుడు ఆదిదేవుడు-ఆదరించెను ఆదుకొనును           (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                (2X)
2.         పరమును విడచి వచ్చాడన్నా- నరులలో నరుడై పుట్టాడన్నా        (2X)
                
పరిశుద్దుడు పావనుడు-ప్రేమించెను ప్రాణమిచ్చెను                       (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                  (2X)
3.         శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న              (2X)
                
మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును (2X)
ఓరన్న  ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా                                   (2X)  

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...