Monday, October 17, 2011

అపరాధిని యేసయ్య


పల్లవి:   అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు       ..అపరాధిని..
1.       సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా         ..అపరాధిని..
2.       ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో               ..అపరాధిని..
3.       ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ                  ..అపరాధిని..
4.       దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను             ..అపరాధిని..
5.       ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా          ..అపరాధిని..

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...